మరో మైలురాయికి చేరువలో సామజవరగమనా సాంగ్

యుంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కెరీర్ లోని బెస్ట్ సాంగ్స్ లో ‘సామజవరగమనా..’ ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు రెండు నెలల క్రితం అల వైకుంఠపురంలో మూవీ నుండి విడుదలైన ఈ మొదటి సాంగ్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ మిక్స్ తో థమన్ చేసిన మెలోడీ మ్యాజిక్ మ్యూజిక్ లవర్స్ ని కట్టిపడేసింది. దీనితో యూట్యూబ్ లో ఈ పాట రికార్డు వ్యూస్ మరియు లైక్స్ సాధించింది. కాగా సామజవరగమనా సాంగ్ మరో మైలు రాయిని చేరుకోనుంది. తక్కువ కాలంలో 100మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ గా రికార్డుల కెక్కనుంది. ఇవాళ లేదా రేపు సామజవరగమనా సాంగ్ 100మిలియన్ వ్యూస్ చేరుకోవడం ఖాయం.

ఇక అలవైకుంఠపురంలో మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తి కావస్తున్నట్లు తెలుస్తుంది. చిత్రంలోని కొందరు నటులు ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేశారు. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పూజ హెగ్డే మరోమారు బన్నీకి జంటగా నటిస్తుండగా, టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలకపాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న అలవైకుంఠపురంలో మూవీ విడుదలవుతుంది.

Exit mobile version