
సమంత, తెలుగునాట అడుగుపెట్టిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇటివల కాలంలో ఇంతటి సక్సెస్ చూసిన హీరోయిన్ లు ఎవరు లేరు. ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లే. ‘ఎం మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంతకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇటివల కాలంలో బాక్స్ ఆఫీసు వద్ద నమోదైన ఐదు సూపర్ హిట్ సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలలో సమంత హీరోయిన్ గా నటించింది. ‘ఈగ’, ‘దూకుడు’, ‘సీతమ్మ వాకీట్లో సీరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’ మరియు ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న ‘మనం’ వంటి సూపర్ హిట్ సినిమాలు సమంత ఖాతాలో ఉన్నాయి.
సమంత పెద్ద పెద్ద హీరోలతో నటించడమే కాకుండా, తన నటనతో, అందంతో తనకంట్టు ఒక గుర్తింపు తెచ్చుకుంది. శుక్రవారం విడుదలైన ‘మనం’ సినిమాలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలని పొందుతుంది. సినిమాలోని రెండు భిన్నమైన పాత్రలలో అద్భుతంగా నటించి, నటనపై ఆమెకు ఉన్న పట్టును మరోసారి కనబరిచింది. దర్శకులంతా ఆమెతో సినిమా తీయడానికి క్యూ కడుతున్నారు.
తెలుగమ్మాయి కానప్పటికీ, తెలుగుపై పట్టు సాధించడానికి కృషి చేస్తూ దాదాపు అన్ని సినిమా ఇంటర్వ్యూలలో తెలుగులోనే మాట్లాడుతుంది. సినిమాల్లోనే కాదు, సమంత సమాజ సేవలోనూ ఔరా అని అనిపించుకుంటుంది. యాడ్స్ లోనూ ఆమెదే పైచేయి, పెద్ద పెద్ద కంపెనీలు సమంత ఖాతాలోనే ఉన్నాయి. అవును నిజంగానే సమంత, టాలీవుడ్ లో తిరుగులేని తార.