మన టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో దర్శకురాలు నందిని రెడ్డి కలయికలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ సినిమానే మా ఇంటి బంగారం. ఎంతో కాలం గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ సమంత పై ఉన్న ప్రేమను తెలుగు ఆడియెన్స్ ఏకంగా 100 కోట్ల వసూళ్లు ఇచ్చి టాలీవుడ్ లో మొదటి 100 కోట్ల ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాగా నిలిపారు.
ఇలా సాలిడ్ లాంగ్ రన్ ని చూసిన ఈ సినిమా ఫైనల్ గా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నేటి నుంచి అందులో ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్ సహా మలయాళ భాషల్లో అందుబాటులో వచ్చేసింది. సో అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు అలానే సమంత నిర్మాణం వహించింది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
