చిట్టిబాబు మాస్ సాంగ్ కి ఎగ్జైట్ అవుతున్న రామ లచ్మి.. పోస్ట్ వైరల్

Peddi

ఇప్పుడు మన తెలుగు సినిమా మ్యూజిక్ లవర్స్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా శ్రోతలు కూడా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని సాంగ్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ కలయికలో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది కొత్త సాంగ్ అనే చెప్పొచ్చు. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

అనేకమంది సినీ ప్రముఖులు కూడా ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా మాట్లాడుతుండగా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో స్టార్ బ్యూటీ రామ్ చరణ్ రంగస్థలం హీరోయిన్ సమంత కూడా చేరింది. ఈ సాంగ్ తాలూకా వీడియో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేసుకొని తన ఎగ్జైట్మెంట్ ని రివీల్ చేసింది. అంతే కాకుండా వన్ అండ్ ఓన్లీ అంటూ రామ్ చరణ్ ని కూడా పొగడ్తల్లో ముంచెత్తింది. ఇలా తన చిట్టిబాబు మాస్ మూమెంట్స్ కి రామ లచ్మి తన ఆనందం పంచుకుంది. దీనితో ఫ్యాన్స్ లో తన పోస్ట్ మంచి వైరల్ గా మారింది.

Exit mobile version