కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్ – 1 ఘన విజయం సాదించింది. ఈ కార్యక్రమం అందించిన ఉత్సాహంతో సీజన్ -2 కి సిద్దమయ్యారు నాగార్జున. నేడు, సోమవారం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్ 2 ప్రారంభమవుతుంది. మొదటి ఎపిసోడ్ లో యువ హీరో నితిన్ అతిధిగా హాజరు కానున్నారు.
సమంత కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. నేడు సమంత ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని సమాచారం. నాగార్జున అడిగిన ప్రశ్నలకు సమంత సరైన సమాధానం చెప్తుందా..? కోటి రూపాయలు గెలుచుకుంటుందా ..? వెయిట్ & సి.
‘మనం’ సినిమాలో తల్లీ కొడుకులుగా సమంత – నాగార్జున నటించారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎన్ని విషయాలు చెప్తారో..? చూడాలి. తెలుగులో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో పాటు తమిళంలో విక్రమ్ సరసన మరో సినిమాలో నటిస్తూ సమంత బిజీగా గడుపుతుంది. మధ్యలో తీరిక చేసుకుని వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తుంది.
