సుకుమార్ సినిమా అంటేనే పాత్రలు, కథ, సన్నివేశాల్లో కొత్తదనాన్ని ఆశిస్తారు ప్రేక్షకులు. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లోను ఆ కొత్తదనం ఉండేలా చూసుకున్న సుకుమార్ త్వరలో రిలీజ్ కానున్న ‘రంగస్థలం’ లో కూడా అదే భిన్నత్వం చూపించనున్నారు. ముఖ్యంగా పాత్రల విషయంలో. ఇప్పటికే వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుగా రామ్ చరణ్ ను విభిన్నంగా చూపించిన ఆయన సమంతను మరింత ఆకట్టుకునేలా చూపించారు.
ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె ‘రంగస్థలం’లో మాత్రం రామలక్ష్మిగా డీ గ్లామరైస్డ్ పాత్రలో అచ్చమైన పల్లెటూరి యువతి లుక్లో ఇదివరకెప్పుడూ మనం చూడని సమంతలా కనిపిస్తూ సినిమాపై, తన పెర్ఫార్మెన్స్ పై అంచనాలను పెంచేసింది. మరి ఈ మధ్య కాలంలో చూడనటువంటి పాత్రల తరహాలో ఉన్న చిట్టి బాబు, రామలక్ష్మిలు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.
