మరోసారి సమాజ సేవతో మనసుదోచిన సమంత

Samantha (17)

అందాల నటి సమంతాకి మంచి మనసున్న విషయం తెలిసిందే. ఆ మాట నిజమని మరోసారి నిరువుపించింది. జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ‘నా బంగారుతల్లి’ సినిమాకి సమంతా స్వచ్చందంగా ప్రచారం చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం సమంతా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా తనకెంత నచ్చిందో తెలిపింది. ఈ సినిమాని కుటుంబ సమేతంగా ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడవలసిన అవసరం వుందని తెలిపింది. తాను నటించని సినిమాకోసం సమంతా చేస్తున్న మంచిపనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి మంచి పనులు భవిష్యత్తులో మరిన్ని జరపాలని ఆశీర్వదిస్తున్నారు

Exit mobile version