స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకురాలు నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని తొలుత మే 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు.
ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని జూన్ 16న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు. పట్టుచీర కట్టుకున్న సమంత చేతిలో తుపాకీ పట్టుకుని యాంగ్రీగా కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాలో ఆమె పాత్రపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇక ఈ చిత్రాన్ని ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సామ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
