మా ఇంటి బంగారం.. నిజంగానే బంగారం లాంటి ఛాన్స్..!

Maa-Inti-Bangaaram

స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడ్డ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ ట్రైలర్ పవర్ ప్యాక్డ్‌గా కట్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, నవ్వులు, సమంత యాక్షన్ సీన్లు అన్నీ ఉండబోతున్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

దర్శకురాలు నందినీ రెడ్డి ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా ఈ ట్రైలర్‌ను చాలా బాగా చూపించారు. ట్రైలర్ హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు సమంత ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో సమంత భర్త రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నారు. ఆయన కూడా సమంతతో కలిసి అన్ని ఈవెంట్స్‌కు వస్తుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఛాన్స్ దొరికింది. జూన్ 19న రిలీజ్ కానున్న సినిమాల్లో క్రేజ్ ఉన్న సినిమా ఇది ఒక్కటే. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా, థియేటర్లలో సమంత ర్యాంపేజ్ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version