రానా నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా సమంత.?

Samantha-rana
ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై రాని నేవీ, సబ్ మెరైన్ కాన్సెప్ట్ మీద రానా డబ్బుబాటి ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయాన్ని ఇది వరకే తెలియజేశాం.1971 లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ లో పాకిస్తాన్ వాళ్ళు విశాఖపట్నం లోని పిఎన్ఎస్ ఘజి సబ్ మెరైన్ పై దాడి చేసి అది సముద్రంలో మునిగిపోయేలా చేసారు. ఈ వీడని మిస్టరీ కథాంశంతో ఈ సినిమాని తీయనున్నారు. సంకల్ప్ అనే రైటర్ ఈ కథని సిద్దం చేసాడు, అతనే ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. బ్లూ ఫిష్ అనే బుక్ ఆధారంగా చేసుకొని తీయనున్న ఈ సినిమాలో రానా నావికా అధికారిగా కనిపించనున్నాడు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం పివిపి వారు ఈ సినిమా కోసం ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో రానాకి జోడీగా సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ సమంతని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం సంకల్ప్ సమంతతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటె పివిపి బ్యానర్ లో తమిళంలో తెరకెక్కిన బనగాలోరే డేస్ రీమేక్ లో ఓ పార్ట్ లో రానా – సమంత జోడీగా కనిపించనున్నారు. అక్కడ వారి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం వలన ఈ సినిమాలో కూడా వారిద్దరినే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘ఘజి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

Exit mobile version