
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఇప్పటివరకు అపజయం ఎరుగని రాజమౌళి సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పైగా చారిత్రాత్మక నేపద్యంలో రూపొందుతున్న ‘బాహుబలి’లో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి..! కనీసం అతిధి పాత్రలో(గెస్ట్ రోల్) అయినా నటించాలని కోరుకుంటారు. బిజీ హీరోయిన్ సమంత ‘బాహుబలి’లో నటించడానికి నో చెప్పిందట.
‘బాహుబలి’ సినిమాలో సమంత నటిస్తే చూడాలని ఉందంటూ కొందరు అభిమానులు కోరడంతో ట్విట్టర్లో సమంత స్పందించింది. ‘నాకు ‘బాహుబలి’లో నటించాలని ఉంది. కాని ఎం చేస్తాం రాజమౌళి గారు అవకాశం ఇవ్వడం లేదు’ అని ట్వీట్ చేసింది. అప్పుడు అసలు విషయం బయటపెట్టారు రాజమౌళి.
‘ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్? ‘బాహుబలి’లో స్పెషల్ రోల్ చేయమని నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే డేట్స్ లేవని తప్పించుకున్నావ్..! ‘ అంటూ రాజమౌళి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఒకవేళ భవిష్యత్లో సమంత ‘బాహుబలి’లో నటించే ఛాన్స్ ఉంటుందేమో అని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరుతుందా..? వెయిట్ & సి.