క్షణం సినిమా తరువాత అడివి శేష్ ప్రస్తుతం స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న’గూఢచారి’ చిత్రంలో నటిస్తున్నాడు. శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంతో శోభిత దూళిపాళ్ల తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ చిత్రం ఫై ఉన్నఅంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని అతిధిపాత్రలో కనిపించనున్నట్లు చిత్ర వర్గాల నుండి సమాచారం వస్తుంది. ఆమె పాత్రకు సంభందించిన చిత్రీకరణను మరి కొద్దీ రోజుల్లో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది.
దాదాపు 150 లొకేషన్లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో సుప్రియ ముఖ్య పాత్రలో నటిస్తుంది. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.
