
బాలీవుడ్‌లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న నటుడు బొమన్ ఇరానీ, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే! ‘అత్తారింటికి దారేది’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆయన త్వరలోనే రవితేజ హీరోగా నటించిన ‘బెంగాల్ టైగర్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 10న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో బొమన్ ఇరానీ విలన్‌గా నటించారు.
ఇక బొమాన్ ఇరానీతో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెబుతూ, బొమాన్ ఇరానీ ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి అని, ఆయనతో కొన్ని రోజుల పాటు కలిసి ఓ సినిమా కోసం పనిచేయడం చాలా నేర్పిందని దర్శకుడు సంపత్ నంది బొమన్ ఇరానీపై ప్రశంసలు కురిపించారు. నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్న బొమన్ ఇరానీకి ఈ సందర్భంగా సంపత్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బెంగాల్ టైగర్ సినిమాతో పాటు అందులో బొమాన్ ఇరానీ చేసిన పాత్ర కూడా అందరికీ నచ్చేలా ఉంటుందని సంపత్ స్పష్టం చేశారు.