రచ్చ డైరెక్టర్ ఫోకస్ మొత్తం మెగా హీరోల పైనే..!

sampath nandi1

ఏమైంది ఈవేళ అనే ఓ రొమాంటిక్ మూవీతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న డైరెక్టర్ సంపత్ నంది రెండో మూవీనే చరణ్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. చరణ్ తో ఆయన చేసిన రచ్చ సూపర్ హిట్ కావడంతో ఆయనకు పవన్ కళ్యాణ్ తో మూవీ చేసే అవకాశం దక్కింది. పవన్ నిర్మాత మరియు రచయితగా పని చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ డైరెక్ట్ చేసే అవకాశం సంపత్ నందికి దక్కింది. కారణం ఏమిటో గాని పవన్ మనసు మార్చుకొని డైరెక్టర్ బాబీతో ఆ మూవీ చేశారు.

ఆ సినిమా కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూసిన సంపత్ కి నిరాశే ఎదురైంది. ఐతే పవన్ తో మూవీ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అన్న సంపత్ ఆయన కోసం కూడా కొన్ని స్క్రిప్ట్స్ సిద్ధం చేసుకొని ఉంచారట. ఇక చిరంజీవి కోసం రజాకార్ల నేపథ్యంలో ఓ స్క్రిప్ట్ రాస్తున్నట్లు, అది పూర్తి అయిన వెంటనే చిరును కలిసి వినిపిస్తాను అని కూడా చెప్పాడు. దీనితో ఈ యంగ్ డైరెక్టర్ ఫోకస్ మొత్తం మెగా హీరోలపై ఉన్నట్లు తెలుస్తుంది. సంపత్ నంది ప్రస్తుతం గోపి చంద్ హీరోగా సీటీమార్ అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version