ఘనంగా ‘కార్మేని సెల్వం’ ట్రైలర్ లాంచ్

sam 2

సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రం ‘కార్మేని సెల్వం’ ఏప్రిల్ 3న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి రానుంది. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దర్శకులు శివ ప్రసాద్, ధనరాజ్, తేజ కాకుమాను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, డబ్బు చుట్టూ తిరిగే జీవితాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ.. “ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఆలోచనలో పడతాడు. తమకున్న లోన్లు, ఈఎమ్ఐలను తగ్గించుకుని, ఆర్థిక భారాలు దించుకుంటేనే కలలు నెరవేరుతాయని ఈ చిత్రం చెబుతుంది” అని అన్నారు. దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ, అప్పులు తగ్గించుకుని ఆనందంగా ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రామానుజం, గీత రచయిత రాంబాబు గోసాల, నటీమణులు లక్ష్మీప్రియా, అభినయ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version