కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సనా మక్బూల్

Sana-Maqbool
‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ సనా మక్బూల్. తొలి సినిమాలో తన నటనతో సనా మక్బూల్ ఆకట్టుకుంది. అజయ్, నాగ శౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమా భారి విజయం సాధించడంతో పాటు సనాకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.

ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘రంగూన్’ సినిమా వాటిలో ఒకటి. చెన్నై మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. మురుగదాస్ శిష్యుడు రాజ్ కుమార్ దర్శకత్వం పెరిస్వామి దర్శకత్వంలో రూపొందబోయే ‘రంగూన్’ సినిమాలో హీరోయిన్ గా సనా మక్బూల్ ఎంపికైంది. ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ హీరో.

Exit mobile version