
రెండున్నర గంటల సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఐదు నిముషాల ఐటెం సాంగులంటే ప్రేక్షకులలో యమా క్రేజ్. అలాంటి ఐటెం సాంగులో ముగ్గురు హీరోయిన్లు ఆడి పాడితే ప్రేక్షకులకు పండగే. ప్రస్తుత ఐటెం సాంగులను తలదన్నే రేంజ్ లో తన కొత్త సినిమాలో సాంగ్ ను ప్లాన్ చేశారు యువ హీరో సందీప్ కిషన్.
‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘జోరు’. ఈ సినిమాలో సందీప్ సరసన ముగ్గురు హీరోయిన్లు రాశి ఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మ నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లపై అదిరిపోయే ఐటెం సాంగును చిత్రీకరించారు. త్వరలో ఈ సినిమా ఆడియో విడుదల చేయనున్నారు. అప్పుడు సాంగ్ టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్ నుండి సెట్, మ్యూజిక్, కోరియోగ్రఫీలపై స్పెషల్ కేర్ తీసుకుని ఈ సాంగ్ రూపొందించారట. భీమ్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రా రా క్రిష్నయ్య’ సినిమాల విజయలతో ‘జోరు’మీదున్న సందీప్ సోలో హీరోగా హట్రిక్ అందుకోవడం ఖాయమని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.