విడుదలకు సిద్ధమైన ‘సందిగ్ధం’.. త్వరలోనే రిలీజ్ డేట్!

Untitled 8 2

తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో వస్తున్న సరికొత్త చిత్రం ‘సందిగ్ధం’. పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్, కాజల్ తివారీ ప్రధాన పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. రాబోయే రోజుల్లో వరుస అప్‌డేట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతం అందించగా, నందన్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రధాన నటీనటులతో పాటు జీవ కోచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version