Toxic Poster: రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ ఫుల్ స్టార్ కాస్ట్ పోస్టర్ రిలీజ్.. ఇంగ్లీష్ ట్రైలర్ టైమ్ ఫిక్స్!

యష్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రధాన తారాగణం లుక్స్‌తో కూడిన పూర్తి పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా, ఈ సినిమాలో నటీనటులు పోషిస్తున్న పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ చిత్రంలో యష్ ‘రాయా’ మరియు అతని కుమారుడు ‘రూమి అలియాస్ టికెట్’గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ ‘నాడియా’ (రూమి తల్లి)గా, నయనతార రాయా సోదరి ‘గంగ’ పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో హుమా ఖురేషి ‘ఎలిజబెత్’గా, తారా సుతారియా ‘రెబెక్కా’గా, రుక్మిణి వసంత్ ‘మెలిస్సా’గా కనిపించనున్నారు. అలాగే అక్షయ్ ఒబెరాయ్ (టోనీ), డారెల్ డిసిల్వా (సాల్వడార్), సుదేవ్ నాయర్ (కర్మాడి), బాలాజీ మనోహర్ (భీర) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఇంగ్లీష్ ట్రైలర్‌ను ఈరోజు రాత్రి 8:30 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 26న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version