ఓటిటిలో డిజాస్టర్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ దర్శకుడు

ప్రస్తుతం ఓటిటి కంటెంట్ కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూస్తూనే ఉన్నాం. మన దేశంలో దాదాపు అన్ని ముఖ్య భాషలు సంబంధించి సాలిడ్ కంటెంట్ ఓటిటిలో అందుబాటులో ఉంటుంది. ఇక ఇందులో బాలీవుడ్ వాటా ఎప్పటిలానే ఎక్కువే ఉంది. అయితే కొందరు స్టార్ దర్శకులు సినిమాల నుంచి ఓటిటి లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అలా రీసెంట్ గా బాలీవుడ్ ఎన్నో సెన్సేషనల్ హిట్స్ తీసిన ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ భారీ క్యాస్టింగ్ తో చేసిన తాజా సిరీస్, “హీరామండి” తో ఎంట్రీ ఇచ్చారు.

అయితే ఈ సిరీస్ రిలీజ్ కాక ముందు వరకు కూడా మంచి అంచనాలు సెట్ చేసుకుంది. పైగా అనుకున్న దానికంటే ఆలస్యంగా రిలీజ్ చేయడం ఒకటి కావడంతో మరింత సస్పెన్స్ తెచ్చుకున్నారు. కానీ రిలీజ్ అయ్యాక మాత్రం భన్సాలీ ఓటిటి ఎంట్రీ తేలిపోయింది అని కామెంట్స్ మొదలయ్యాయి. తన ఓటిటి ఎంట్రీ ఇంత పేలవంగా ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు.

మామూలుగా భన్సాలీ నుంచి కంటెంట్ అంటే భారీతనంతో పాటుగా సాలిడ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. కానీ హీరమండి లో కేవలం ఖర్చు తప్ప ఇంకేమి కనిపించలేదు అని చూసిన వీక్షకులు సోషల్ మీడియాలో పెదవి విరుస్తున్నారు. దీనితో అయితే ఓటిటిలో మాత్రం భన్సాలీ డిజప్పాయింట్ చేసారని చెప్పక తప్పదు.

Exit mobile version