సంజు కొత్త రికార్డు క్రియేట్ చేశాడు !

Sanju

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంజు’. విడుదలైన రోజునుండి ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇప్పుడు కలెక్షన్స్ పరంగా అమీర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘పి కె’ ను క్రాస్ చేసి బాలీవుడ్ లో అత్యధిక గ్రాస్ వసూళ్లను దక్కించుకున్న జాబితాలో 3వ స్థానంలో నిలిచింది ‘సంజు’. ఇప్పటివరకు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 341 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

ఇక ఈ చిత్రం అటు ఓవెర్సిస్లో కూడా మంచి వసూళ్లను సాధించి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రాన్ని విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ లు సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version