బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సంజు !

Sanju

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవిత కథతో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది . ఈ చిత్రం రెండవ రోజు 38.6 కోట్ల ను ఖాతాలో వేసుకొని ఇప్పటివరకు 73 కోట్లను కలెక్ట్ చేసింది.

మంచి రివ్యూస్ ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ను అలోవోకగా అధిగమించనుంది . రణబీర్ కపూర్ నటన , రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్ర విజయంలో కీలక పాత్రను పోషించాయి .

Exit mobile version