ఇంటర్వ్యూ : సంకల్ప్ రెడ్డి – ‘అంతరిక్షం’ తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది !

‘ఘాజీ ‘లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన రెండవ చిత్రం ‘అంతరిక్షం’. ఈ చిత్రం డిసెంబర్ 21 న విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

స్పేస్ నేపథ్యంలో సినిమా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ?

ఒక రోజు స్పేస్ కు సంబందించిన ఒక ఆర్టికల్ ను చదివా చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. వెంటనే ఫిక్స్ అయ్యాను స్పేస్ నేపథ్యంలో సినిమా తియ్యాలని ఘాజీ పూర్తయిన మూడు నెలల తరువాత ఈసినిమా స్క్రిప్ట్ ను రాయడంమొదలు పెట్టా.

ఈ సినిమా హాలీవుడ్ చిత్రాలకు కాపీ నా ?

లేదు. అంతరిక్షం కంప్లీట్ గా డిఫ్రెంట్ స్టోరీ. గ్రావిటీ , ఇంటర్స్టెల్లార్ లాంటి చిత్రాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశాను. ఈచిత్రం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.

షూటింగ్ ఎలా జరిగింది ?

సినిమా షూటింగ్ ను 70 రోజుల్లో పూర్తి చేశాం. సెట్ లో నేను మా డీఓపీ ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్లం. చాలా సైలెంట్ గా ఉండేది అరవడాలు కానీ ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా సీరియస్ గా ఫోకస్ పెట్టి సినిమాకి పనిచేశాం.

వరుణ్ ను ఎలా ఒప్పించారు ?

ఈ సినిమాకి వరుణ్ తేజ్ అయితేనే పూర్తిగా న్యాయం చేయగలడు అనిపించి ఆయనను కలిసాను. ఒక పిక్ చూపెట్టి బేసిక్ స్టోరీ లైన్ ను చెప్పాను. 4 నెలల తరువాత మళ్ళీ కలిసి పూర్తి స్క్రిప్ట్ ను వినిపించాను. వరుణ్ కు చాలా నచ్చి సినిమాకి ఒకే చెప్పాడు. ఈసినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు.

నిర్మాతల గురించి ?

రాజీవ్ రెడ్డి , సాయి బాబు లు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా చిన్న బడ్జెట్ చిత్రం కాదు. ఖర్చు కు వెనుకాడకుండా నన్ను నమ్మి మంచి బడ్జెట్ కేటాయించారు. అవుట్ ఫుట్ విషయంలో కూడా వారు చాలా హ్యాపీగా వున్నారు.

బాలీవుడ్ లో ఏమైనా ఆఫర్లు వచ్చాయా ?

అక్కడ రెండు సినిమాలు చేయాల్సి వుంది. ఈచిత్రం విడుదలైన తరువాత ఆ సినిమాలపై ఫోకస్ పెడతాను.

Exit mobile version