ఓటిటిలోకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్స్ మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు

anaganaga-oka-raju

ఈ కొత్త ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు అలాగే స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు మారి తెరకెక్కించిన సినిమా అనగనగా ఒక రాజు కూడా ఒకటి. మరి ఈ రెండు సూపర్ హిట్ చిత్రాలు ఇవాళ్టి నుంచి ఓటిటిలోకి వచ్చేసాయి.

ఈ సినిమాల్లో మెగాస్టార్ సినిమాని జీ 5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా పాన్ ఇండియా ముఖ్య భాషలు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ సహా బెంగాలీ ఇంకా మరాఠి భాషలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కి రాగా ఇక అనగనగా ఒక రాజు సినిమా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు చూసి మళ్ళీ ఓటిటిలో చూసి ఎంటర్టైన్ అవుదాం అనుకునే వారు ఓటిటిలో ఈ చిత్రాలు చూసి ఎంజాయ్ చేయవచ్చు.

మన శంకర వరప్రసాద్ గారు సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అనగనగా ఒక రాజు సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version