ప్రభాస్ అన్న సపోర్ట్ మా అదృష్టం.. శివ, మిత్రల జర్నీ అందరికీ నచ్చుతుంది – సంతోష్ శోభన్

Couple-Friendly

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ సినిమాకు ‘ఏ’ (A) సర్టిఫికెట్ రావడంపై నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని క్లారిటీ ఇచ్చారు. కేవలం టైటిల్ మార్చడానికి నిరాకరించడం వల్లే సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చిందని, కానీ సినిమాలో అశ్లీలతకు తావులేదని స్పష్టం చేశారు. ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గ స్వచ్ఛమైన ప్రేమకథ అని తెలిపారు. ఫిబ్రవరి 13 సాయంత్రం నుంచే హైదరాబాద్, చెన్నై, వైజాగ్ తదితర ప్రాంతాల్లో ప్రీమియర్స్ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో శివ, మిత్ర పాత్రల ప్రయాణం చాలా కొత్తగా, ఎంగేజింగ్ గా ఉంటుంది. టైటిల్ ఎందుకు ‘కపుల్ ఫ్రెండ్లీ’ అని పెట్టారో సినిమా చూస్తే అర్థమవుతుంది. మేం అడగకముందే ప్రభాస్ అన్న మా ట్రైలర్‌ను షేర్ చేసి సపోర్ట్ చేయడం మా అదృష్టం’’ అని ఆనందం వ్యక్తం చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందని, టీమ్ అంతా ఎంతో కష్టపడి పనిచేశారని హీరోయిన్ మానస వారణాసి పేర్కొన్నారు.

Exit mobile version