
ఒకే ఒక్క పోస్టర్ తో సోషల్ మీడియాలో పరిచయమే అవసరం లేని స్టార్ గా ఎదిగిన హీరో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. ‘హృదయ కాలేయం’ లాంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత సంపూర్నేష్ బాబు చేస్తున్న మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సింగం123’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ లో సంపూర్నేష్ బాబు చెప్పిన ‘రేసులో నన్ను అందుకోడానికి నేను రేసుగుర్రాన్ని కాదు.. రెడ్‌బుల్ తాగిన సింహాన్ని రా..’ అన్న డైలాగ్స్ కి ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. ఇది కాకుండా ఈ రోజు సింగం 123 ఆడియో రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ డైలాగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే ముందు ఈ సినిమాని మే 22న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం సింగం 123 సినిమాని వాయిదా వేసారు. దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో ఎక్కువభాగం గ్రాఫిక్స్ కి స్కోప్ ఉండడమే.ఈ సినిమాని ఏప్రిల్ లోనే రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వల్ల ఆలస్యం అవుతుండడం వల్ల వాయిదా వేసారు. ఈ నెల 20న మంచి మనోజ్ వివాహ మహోత్సవం కూడా ఉండడం వలన ఈ సినిమాని మే 28న లేదా జూన్ మొదటి వారంలో రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో మంచు విష్ణు రచయితగా మారడమే కాకుండా, తన హోం బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. శేషు మ్యూజిక్ అందించిన ఈ సినిమా ద్వారా అక్షత్ వర్మ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మే లేదా జూన్ మొదట్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.