‘సర్దార్ 2’ ట్రైలర్ పై లేటెస్ట్ అప్ డేట్

దర్శకుడు ‘పి.ఎస్. మిత్రన్’ దర్శకత్వంలో కార్తీ ‘ఏజెంట్’ పాత్రలో తిరిగి నటిస్తున్న చిత్రం ‘సర్దార్ 2’. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ మరియు ఆడియోను ఈ రోజు రాత్రి 8:15 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సీక్వెల్ పట్ల ఆసక్తి పెరుగుతున్న తరుణంలో, థియేటర్లలో విడుదలకు ముందు ఈ ట్రైలర్ ఆ అంచనాలను ఏ విధంగా అందుకుంటుందో చూడాలి.

కాగా 2026 సెప్టెంబర్ 10న విడుదల కానున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ‘ప్రిన్స్ పిక్చర్స్’ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు; ఈ సినిమాకి సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు. తెలుగులో సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version