
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న తదుపరి సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఇటీవలే గుజరాత్ వెళ్లి అక్కడ లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేసుకొని వచ్చిన ఈ చిత్ర టీం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ప్రస్తుత షూటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ తన గ్యాంగ్ తో పోలీస్ స్టేషన్ లో సందడి చేసే కొన్ని సీన్స్ ని షూట్ చేసున్నారు. నవంబర్ 15కల్లా ఈ షెడ్యూల్ ని పూర్తి చేసి ఓ మేజర్ షెడ్యూల్ కోసం గుజరాత్ వెళ్లనుంది. ఇదిలా ఉంటే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్ర టీం రిలీజ్ కోసం ఓ డేట్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు.
తాజాగా ఈ చిత్ర టీంకి బాగా సన్నిహితులైన వారి నుంచి అందిన సమాచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించినట్లు చెబుతున్నారు. సమ్మర్ సీజన్ లో మొదటి సినిమాగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ ముఖ్య పాత్రలో కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించనుంది. ఇటీవలే ఆ సాంగ్ ని కూడా షూట్ చేసేసారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హైదరాబాద్, గుజరాత్ షెడ్యూల్స్ తర్వాత ఓ లాంగ్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం రాజస్థాన్ వెళ్లనున్నారు.