చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూలై 29 నుంచి తన నెక్స్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్దార్’ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ తన దగ్గం లుక్ తీసేసి ఎప్పటిలానే క్లీన్ షేవ్ లుక్ లోకి వచ్చి ఈ సినిమాని స్టార్ చెయ్యడమే కాకుండా షూటింగ్ మొదటి రోజే ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసాడు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయిన ఈ సెకండ్ షెడ్యూల్ నిన్నటితో పూర్తయ్యింది. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు, పవన్ విలన్స్ కి దమ్కీ ఇచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. దాంతో అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కి పాకప్ చెప్పారు.
ఒక నాలుగు రోజుల గ్యాప్ తర్వాత సర్దార్ నెక్స్ట్ షెడ్యూల్ ఆగష్టు 10 నుంచి హైదరాబాద్ లోనే ప్రారంభం కానుంది. పవన్ కి పోటీ ఇచ్చే విలన్ గా మరాఠీ నటుడు శరత్ కేల్కర్ కనిపించనున్న ఈ సినిమాకి పవర్ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయిన బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం పవన్ కి సరిపోయే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ ని కూడా కంపోజ్ చేసేసాడు.
