‘సరిలేరు నీకెవ్వరు’ ముందుగానే స్పెషల్ షోలు !

Sarileru Neekevvaru 2

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. అయితే 10వ తేదీ అర్థరాత్రి దాటిన తరువాత ఈ సినిమా షోలు పడేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను దాటాలంటే.. ఫస్ట్ డే 40 కోట్లకు పైగా వసూళ్లు రావాలి. అందుకే అర్థరాత్రి దాటిన తరువాత, తెల్ల వారు ఝామున స్పెషల్ షోలు రూపంలో అదనపు షోలు వేసి, అదనపు కలెక్షన్స్ ను రాబట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పైగా థియేటర్లలో దర్బార్ సినిమా మినహా ఇంక ఏ సినిమా ఉండకపోవడం కూడా ఈ సినిమాకి కలిసి రానుంది.

కాగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ ట్రైలర్ లు ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version