ట్రెండింగ్ లో.. ‘సరిలేరు నీకెవ్వరు’ !

Sarileru 1

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తోన్న క్రేజీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఇప్పటివరకూ 6.2 మిలియన్ల‌కు పైగా వ్యూస్ సాధించింది. దీంతో లేడీ అమితాబ్ విజయశాంతి ఈ ట్రైలర్ ట్రెండ్ అవుతోందని ట్వీట్ చేశారు. ప్రజల అభిమానంతో ఈ ట్రైలర్ ట్రెండింగ్ నెం.1 అంటూ ఆమె పోస్ట్ చేశారు. ట్రైలర్ లో మంచి ఫన్ అండ్ హెవీ యాక్షన్ తో పాటు ఎమోషన్ అండ్ మహేష్ బాబు లుక్ అండ్ స్టైల్, అనిల్ రావిపూడి టేకింగ్ అండ్ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి ఈ ట్రైలర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

కాగా రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ లో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version