ప్రముఖ తమిళ కమెడియన్ సతీష్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. జీవా కథానాయకుడిగా తమిళ భాషలో నిర్మిస్తున్న గొరిల్లా అనే చిత్రంలో సతీష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు . అర్జున్ రెడ్డి ఫెమ్ షాలిని పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది .
గొరిల్లా థ్రిల్లర్ నేపధ్యంలో సాగే సినిమా మాహాబలిపురం చిత్ర దర్శకుడు డాన్ సాండీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గొరిల్లా చిత్రం జూన్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది .
