‘శతమానం భవతి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఈయన ప్రస్తుతం నితిన్, రాశీఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తన తరువాతి చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ దుర్గ ఆర్ట్స్ లో చేయనున్నారని సమాచారం.
ఈ బ్యానర్ ప్రముఖ సినిమాటోగ్రఫర్, నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డికి చెందినది. ఈయన గతంలో అనేక మంచి చిత్రాలను నిర్మించారు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమాని తెరకెక్కిస్తారో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇకపోతే ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా ఆగష్టు రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
