
ఒక స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో మరే ఇతర పెద్ద సినిమా ఆఫర్ వచ్చినా డేట్స్ సర్దుబాటు కాక కొన్ని సార్లు ఆ అవకాశాన్ని వదులుకొని తీరాలి. కానీ ఓ చిన్న సినిమా కోసం స్టార్ హీరోని వదులుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అదే పనిని తమిళ స్టార్ యాక్టర్ సత్యరాజ్ చేసాడు. అసలు విషయంలోకి వెళితే అదిత్ అరుణ్, డింపుల్ చోపడే జంటగా ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘తుంగభద్ర’. పల్లెటూరి రాజకీయాల నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ నటుడు సత్యరాజ్ సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం సత్య రాజ్ మహేష్ బాబు సినిమాని కూడా వదులుకున్నారు.
సత్యరాజ్ ఈ సినిమా చేస్తున్న టైంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చేసి ఉండడం వల్ల ఆ సినిమాకి నో చెప్పాల్సి వచ్చింది. ఇదే విషయాన్నీ ఈ చిత్ర హీరో అదిత్ అరుణ్ చెప్పాడు. ఒక చిన్న సినిమా కథను నమ్మి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న సత్యరాజ్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. గోగినేని శ్రీనివాస కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వారాహి చలన చిత్రం వారు కొత్త దర్శకులను, కొత్త నటీనటులను ఎంకరేజ్ చేస్తూ చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాలను అందుకుంటుంది. గత సంవత్సరం ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాలతో హిట్స్ అందుకున్న సాయి కొర్రపాటి ‘తుంగభద్ర’ సినిమా విజయంపై కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు.