విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తు్న్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి క్రియేట్ చేసింది. వెంకటేష్ మహా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సినీ వర్గాల్లో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్ర టీజర్‌ను ‘జస్ట్ ఏ టీజర్’ అంటూ జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో సత్యదేవ్ వైవిధ్యమైన గెటప్స్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక దీపా థామస్ హీరోయిన్గా నటిస్తున్న వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
