టాలీవుడ్లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘జెట్ లీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు రితేష్ రాణా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సత్య లీడ్ రోల్లో నటిస్తున్నాడు. రియా సింఘ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు(జనవరి 3) సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ పోస్టర్లో సత్య, రియా సింఘ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. దీంతో ఈ సినిమాలో వీరిద్దరు ఎలాంటి యాక్షన్ చేయబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, హర్ష చెముడు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
