ట్రైలర్ టాక్ : ‘జెట్లీ’గా సత్య ఎంట్రీ.. ఈ సమ్మర్‌లో నవ్వుల వర్షం ఖాయం..!

Jetlee

టాలీవుడ్ వెర్సటైల్ కమెడియన్ సత్య లీడ్ రోల్‌లో నటించిన ‘జెట్లీ’ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘మత్తు వదలరా’ వంటి వినూత్న చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు రితేష్ రాణ ఈ సినిమాను మరోసారి తనదైన ఫన్ రైడ్‌గా రూపొందించాడు. ఈ ట్రైలర్‌లో సత్య తన మార్క్ టైమింగ్‌తో అదిరిపోయే వినోదాన్ని పంచాడు.

మతిమరుపు ఉన్న వ్యక్తిగా సత్య చేసే కామెడీ, ముఖ్యంగా ఈ చిత్ర కథ మొత్తం విమానంలో జరగడంతో అందులో సత్య ఎలాంటి ఫన్ రైడ్ ఇవ్వబోతున్నాడో మనకు ఈ ట్రైలర్‌లో శాంపిల్ చూపెట్టారు. ఇక ఈ సినిమాలో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తోంది. కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు రితేష్ రాణా మార్క్ టేకింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నట్లు స్పష్టమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

బాక్సాఫీస్ వద్ద ఈ సమ్మర్ బరిలో నిలవబోతున్న ఈ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ‘జెట్లీ’, సత్య కెరీర్‌లో హీరోగా మరో మంచి విజయాన్ని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు కావాల్సిన ఫుల్‌టూ ఫన్ రైడ్ ఈ జెట్లీ అందిస్తాడని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version