టీజర్ టాక్ : ‘రావు బహదూర్’తో మిరాకిల్ చేసేందుకు సిద్ధమైన సత్యదేవ్..!

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వస్తున్న సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా ‘రావు బహదూర్’. తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన ‘జస్ట్ ఏ టీజర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి సోషల్ మీడియాలో భారీ క్యూరియాసిటీని పెంచుతోంది. అంతరించిపోతున్న ఒక రాచరిక వ్యవస్థ నేపథ్యంలో, గతాన్ని వదిలిపెట్టలేని ఒక వ్యక్తి కథగా ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా ప్లాన్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ సరికొత్త టీజర్ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఓపెన్ అవుతుంది. ఇందులో సత్యదేవ్ పోషించిన రామప్ప అనే పాత్రకు లివర్ క్యాన్సర్ అని, ఆయనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉందని వైద్యులు చెబుతారు. అయితే, నెలలు గడుస్తున్నా సత్యదేవ్ పాత్ర ఏమాత్రం కుంగిపోకుండా బతికే ఉండటం, అది చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోవడం కథపై ఆసక్తిని కలిగిస్తుంది. కేవలం ఇదొక మిరాకిల్ మాత్రమే కాదు, రామప్ప అంతరంగంలో జరుగుతున్న మానసిక మార్పులను, ఒక విలక్షణమైన సైకలాజికల్ టెన్షన్‌ను టీజర్‌లో చూపించారు.

‘డౌట్ ఈజ్ ఏ డెడ్లీ డెమన్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీజర్‌లో సత్యదేవ్ నటన, ఆయన చూపించిన వేరియేషన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. స్మరణ్ సాయి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కార్తీక్ పర్మార్ విజువల్స్ టీజర్‌కు మరింత డార్క్ మూడ్‌ను సెట్ చేశాయి. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version