ఓటిటి పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న సత్యదేవ్ “కృష్ణమ్మ”

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అయిన సత్యదేవ్ తదుపరి కృష్ణమ్మ అనే యాక్షన్ డ్రామా లో కనిపించనున్నారు. మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన డిజిటల్ హక్కుల పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. నేడు రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ లో మేకర్స్ డిజిటల్ పార్ట్ నర్ కి సంబందించిన విషయం పై అప్డేట్ ను అందించారు.

ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఈ చిత్రం ప్రైమ్ వీడియో లోకి రానుంది. వివి గోపాల కృష్ణ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆతిరా రాజ్ మహిళా ప్రధాన పాత్రలో నటించగా, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలను నిర్వహించనున్నాయి.

Exit mobile version