‘సవ్యసాచి’ రన్ టైం ఎంతంటే !

savyasachi sensor4
యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన యాక్షన్ డ్రామా ‘సవ్యసాచి’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 2న విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ చిత్రం 150 నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా కీరవాణి సంగీతం అందించారు.

హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ లో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చైతన్య -చందు మెండేటి కలయికలో వస్తున్న ఈచిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి. ఇక ఇటీవల వరుస పరాజయాలతో కొనసాగుతున్న చైతూ ఈ చిత్రం ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

Exit mobile version