
దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ఎర్రబస్సు’. మంచు విష్ణు, కేథరిన్ త్రేసా జంటగా నటించారు. చక్రి సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ఆరు పాటలకు అద్బుతమైన స్పందన లభించింది. నవంబర్ 14న చిల్డ్రన్ డే కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మంజా పై’ రీమేక్ గా ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే.
తమిళ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు సినిమాలో చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే. నా మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తరహాలో ‘ఎర్రబస్సు’ స్క్రీన్ ప్లే ఉంటుంది అని దాసరి చెప్పారు.
తాతా మనవళ్ళ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచి సందేశాన్ని ప్రేక్షకులకు అందించాం. ఇటీవల ఎక్కువ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు వస్తున్నాయి. మంచి కుటుంబ విలువలు కలిగిన సినిమాల అవసరం ఎంతైనా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. విష్ణుకి నటుడిగా మంచి పేరు తీసుకొస్తుంది అని దాసరి నారాయణరావు అన్నారు.