టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, స్టార్ హీరోయిన్ సమంత లేడీ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ఖుషి. ఈ చిత్రం ను సెప్టెంబర్ 1, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ఆరాధ్య పాట రిలీజ్ అయి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
