కేరళ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైన ‘శ్రీమంతుడు’

srimnathudu
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాటినుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్, కర్ణాటక.. ఇలా అన్ని చోట్లా ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ భారీ కలెక్షన్స్ సాధించింది. ఇక తెలుగుతో పాటు, తమిళంలోనూ ‘సెల్వందన్‌’గా ఆగష్టు 7నే విడుదలైన ఈ సినిమాకు తమిళ నాట కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చెన్నై బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.

ఇక ఇదిలా ఉంటే.. ఇప్పుడు తాజాగా శ్రీమంతుడు తమిళ వర్షన్ సెల్వందన్ కేరళ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధం అయింది. కేరళలో సెల్వందన్‌ను ఆగష్టు 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో మహేష్ హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమా కేరళలో మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇక ‘సెల్వందన్’ సినిమా ఇప్పటికే అంతటా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో కేరళలో కూడా ఈ సినిమా మంచి వసూళ్ళు రాబడుతుందని అంచనా. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‍గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించింది.

Exit mobile version