ట్విట్టర్ లో చేరిన ప్రముఖ నిర్మాత

Suresh-babu
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి ఈరోజు ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు. ఆయన ప్రప్రధమ ట్వీట్ గా మార్స్ మిషన్ సక్సెస్ సందర్భంలో భారతదేశ గొప్పతనాన్ని అభివర్ణించారు. అంతేకాక నిన్న రానా దగ్గుబాటి పెట్టిన ఒక ఫోటోకి “ఇంతకన్నా ఎత్తుకి ఎదగాలేవా?” అని పంచ్ రిప్లై కూడా పెట్టారు

సురేష్ బాబు తెలుగు సినిమా నిర్మాణ విధివిధానాలలో ఆరితేరి తలపండిన నిర్మాతలలో ఒకరు. ప్రస్తుతం ఆయన సోషల్ నెట్వర్కింగ్ లలో యాక్టీవ్ గా వుంటున్నారు. ఫేస్ బుక్ లో సైతం వివిధ అప్డేట్ లు పోస్ట్ చేస్తున్నారు

సురేష్ బాబు చదువరి. ఆయననుండి కొన్ని ఆసక్తికరమైన ట్వీట్ లను ఆశించవచ్చు. సురేష్ ని ఫాలో అవ్వడానికి ఐ.డి @SBDaggubati .

Exit mobile version