బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ తీయనున్న స్టార్ డైరెక్టర్ !

3 ideats

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ రూపొందించిన సినిమాల్లో ‘త్రీ ఇడియట్స్’ కూడ ఒకటి. అమీర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2009లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.ఈ చిత్రాన్ని శంకర్ తమిళంలోకి రీమేక్ చేశారు కూడ. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ రాసే పనిలో ఉన్నారట హిరానీ.

ఎప్పటి నుంచో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని భావిస్తున్న హిరానీ ఈ మధ్యే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారట. ప్రస్తుతం ‘సంజు’ సినిమా విడుదల పనుల్లో ఉన్న ఆయన ఇంకొద్ది రోజుల్లో ‘మున్నాభాయ్’ ప్రాంచైజీలో 3వ భాగాన్ని మొదలుపెట్టనున్నారు.అది పూర్తవగానే ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్ మొదలుపెడతారట.

Exit mobile version