
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ గత గురువారం రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండడం ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతోంది. కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సూపర్ సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కూడా బాగానే కురిపిస్తోంది. వీకెండ్ లో బాగా కలెక్ట్ చేసిన ఈ సినిమా వీక్ డే అయిన సోమవారం కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంది.
తాజాగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న సమాచారం ప్రకారం సుబ్రమణ్యం ఫర్ సేల్ మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సుమారు 12.5 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. అలాగే మొదటి వారం పూర్తయ్యే టైంకి నిర్మాత పెట్టిన బడ్జెట్ రికవర్ అయిపోతుందని, దాదాపు అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాభాల జోన్ లోకి వెళ్లిపోతారని సమాచారం. సాయిధరమ్ తేజ్ మూడవ సినిమాతోనే బాక్స్ ఆఫీసు వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకోవ్డంతో ఈ చిత్ర టీం చాలా చాలా హ్యాపీగా ఉంది. కథ పాతదే అయినా హరీష్ శంకర్ మార్క్ కామెడీ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. సాయిధరమ్ తేజ్ – రెజీన కసాండ్ర జంటగా నటించిన ఈ సినిమాకి వీరిద్దరి కెమిస్ట్రీనే స్పెషల్ హైలైట్ అయ్యింది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు.