స్టార్ట్ టు ఎండ్ తెగ నవ్వించే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’

స్టార్ట్ టు ఎండ్ తెగ నవ్వించే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’

Published on Sep 9, 2015 1:54 PM IST

sfs
ఒక సినిమాలో కామెడీ పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయ్యింది అంటే ఆ సినిమా ఎవరూ ఊహించని హిట్ అవుతుందని ఇప్పటికే చాలా సినిమాలు ఋజువు చేసాయి. దాంతో ఈ మధ్య స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడక్కడా కామెడీ ఉన్న సినిమాలే పెద్ద హిట్ అవుతుంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకూ ఆడియన్స్ ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించే కామెడీ ఉంటే ఇక ఆ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద తిరుగేలేదు. ఇప్పుడు అదే ఫార్మాట్ లో వస్తున్న సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టర్.

హరీష్ శంకర్ సినిమా అనగానే ఆడియన్స్ ని బాగా నవ్వించే కామెడీ, దీపావళి పటాకుల్లా పేలే మాస్ పుచ్ డైలాగ్ లు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ట్రైలర్స్ లో రిలీజ్ చేసిన కామెడీ సీన్స్ మరియు పంచ్ డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హరీష్ శంకర్ ఈ సినిమా స్టార్ట్ టు ఎండ్ ఆడియన్స్ ని బాగా నవ్వించేలా కథని సిద్దం చేసి, అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయ్యేలా సినిమా తీసాడని ఈ చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే సాయిధరమ్ తేజ్ – రెజీనల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా బాగా సరదాగా ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడిని బాగా నవ్వించే సినిమా సుబ్రమణ్యం ఫర్ సేల్ అని ఈ చిత్ర టీం అంటోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు వారల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఈ చిత్ర టీం భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు