మళ్లీ డాక్టరేట్ అందుకున్న షారుక్ ఖాన్ !

SRK

బాలీవుడ్ లో బాద్షాగా స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న షారుక్ ఖాన్ డాక్టరేట్ అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లండన్ కు చెందిన ఫిలాంట్రోఫి విశ్వవిద్యాలయం షారుక్ ఖాన్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. కాగా తనకు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చినందుకు ఫిలాంట్రోఫి విశ్వవిద్యాలయంకు షారుక్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఇక ఇటీవల జీరో తో ప్రేక్షకులముందుకు వచ్చిన షారుక్ కు ఆ సినిమా షాక్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త రాకేష్ శర్మ బయోపిక్ లో నటించాల్సి వుంది. కానీ అనివార్యకారణాల వల్ల షారుక్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.

Exit mobile version