అర్జున్ రెడ్డి హీరోయిన్ సోనాలిగా..!

shalini

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం నిశ్శబ్దం. దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నఈ హారర్ థ్రిల్లర్ లో అనుష్క మూగదైన ప్రొఫెషనల్ పెయింటర్ గా నటిస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్… కోన ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీలో మరో కీలక పాత్ర చేస్తున్న షాలిని పాండే లుక్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. షాలిని ఈ మూవీలో సోనాలి అనే పాత్రలో కనిపించనున్నారు. షాలిని కీలక మర్డర్ కేసులో సాక్షి లేదా, ఆత్మ గా నటించే అవకాశం కలదు.

అమెరికా లోని సియాటిల్ ప్రదేశంలో ఈ మూవీ కథ మొత్తం నడుస్తుంది. ఈ మూవీలో హీరోగా చేస్తున్న మాధవన్ మ్యుజీషియన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ అంజలి సియాటిల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా చేస్తున్నారు. అనుష్క పుట్టిన రోజున విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అరుంధతి, భాగమతి వంటి హారర్ చిత్రాలలో మెప్పించి సూపర్ హిట్స్ అందుకున్న అనుష్క నిశ్శబ్దం చిత్రంలో ఎలా నటిస్తారో చూడాలి మరి.

Exit mobile version