వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మాణంలో, యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్చనా అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్ కీలక పాత్రలు పోషించారు.
హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. “ప్రభాస్ గారు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాజిటివ్ రెస్పాన్స్ రావడం మా టీంకు ఉత్సాహాన్నిచ్చింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో సినిమా తీశారు. డిసెంబర్ 25న విడుదల అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది” అన్నారు.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. “శివుడి ఆశీస్సులతో మా సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఆది గారి సపోర్ట్ వల్లే సినిమా ఈ స్థాయిలో వచ్చింది. ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. డిసెంబర్ 25న థియేటర్లలో చూసి సపోర్ట్ చేయండి” అన్నారు.
హీరోయిన్ అర్చనా అయ్యర్ మాట్లాడుతూ.. “ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు, నిర్మాతలకు థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చింది, సినిమా దాని కంటే పదింతలు బాగుంటుంది” అన్నారు. నటులు రవివర్మ, ఇంద్రనీల్, మధు నందన్ కూడా సినిమా థియేటర్లో తప్పక చూడాలని ప్రేక్షకులను కోరారు.
